AIPKMS ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల హక్కుల గురించి విస్తృత ప్రచారం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం, బోర్గం గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) సభ్యులు సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో AIPKMS రాష్ట్ర నాయకులు, పి రాజేశ్వర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు 12000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం, ఐడీ కార్డులు ఇవ్వడం, అలాగే నెలకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం వంటి ఎన్నికల హామీలు త్వరలో అమలు చెయ్యాలని తెలిపారు.

బోర్గం గ్రామంలో AIPKMS జిల్లా సహకార కార్యదర్శి షేక్ నసీర్ కరపత్రాలు పంచుతూ, వ్యవసాయ కార్మికులకు సంబందించిన హక్కులు మరియు సహాయల గురించి వివరణ ఇస్తూ, కార్మికుల హక్కుల కోసం ఈ ప్రచారం చేపడుతున్నామని, ప్రభుత్వంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి నిరంతరం పోరాడుతారని తెలిపారు.

ఈ ప్రచారంలో రెంజల్ మండల అధ్యక్షుడు ఒడ్డెన్న, మండల కార్యదర్శి షేక్ నసీర్, కోశాధికారి సిద్ధ పోషెట్టి, రాష్ట్ర నాయకులు పుట్టి నాగన్న, సాకలి సాయిలు, కురుమే మల్లేష్, కురుమే రవి, నాగోల్ల లక్ష్మణ్, గుండ్ల సాయిలు మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.
అదేవిధంగా వ్యవసాయ కార్మికులు ఈ కార్యక్రమంలో మంచి ఉత్సాహంతో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆశాభావం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment