|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వారాంతపు సంత నిర్వహణ హక్కుల కోసం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు.
ప్రతి మంగళవారం జరిగే ఎడపల్లి వారాంతపు సంత నిర్వహణకు సంబంధించిన ఈ వేలంపాట బుధవారం ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగనుంది అని, ఈ ప్రక్రియలో పాల్గొనదలిచిన వ్యాపారులు ముందుగా రూ.20,000 డిపాజిట్ చెల్లించి అర్హత పొందాల్సి ఉంటుందని అధికారి స్పష్టం చేశారు.
వేలంపాటలో అత్యధిక ధర పలికిన వ్యక్తికి వారాంతపు సంత నిర్వహణ హక్కులు అధికారికంగా అప్పగించబడతాయి. అలాగే వేలంపాట ప్రారంభానికి ముందు సంత నిర్వహణకు సంబంధించిన పూర్తి నియమ నిబంధనలను పాల్గొనేవారికి వివరించనున్నట్లు తెలిపారు. ఈ టెండర్ ద్వారా కేటాయించబడే వారాంతపు సంత నిర్వహణ హక్కులు 01-04-2026 నుంచి 31-03-2027 వరకు అమల్లో ఉంటాయి. ఆసక్తి గల వ్యాపారులు సమయానికి హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గ్రామ పంచాయతీ అధికారి సూచించారు.








