మెదక్: కుటుంబ సమేతంగా వినాయక పూజ ఎస్.పి శ్రీనివాస రావు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో వినాయక మండపం వద్ద జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు కుటుంబ సమేతంగా వినాయక పూజలో పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా పోలీస్ కార్యాలయంలో గణపతి ప్రతిష్టాపన చేసి సిబ్బందితో కలిసి భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఈ సందర్భంగా ఎస్పీ కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడిని పూజించి, ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి తీర్థప్రసాదం స్వీకరించారు.

పూజ అనంతరం ఎస్పీ మాట్లాడుతూ – వినాయక చవితి ఐక్యత, అంకితభావం, శాంతి-సౌభ్రాత్రుత్వానికి ప్రతీక. ఈ పర్వదినం జిల్లావాసులందరికీ శుభఫలితాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. అలాగే వినాయక నిమజ్జన సమయంలో శాంతిభద్రతల కోసం పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment