|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సిద్దాపూర్ నుండి ఇసుక రవాణా కోసం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో,
గ్రామ పెద్దలు ఈ విషయంపై స్పందిస్తూ, ఇసుక ట్రాక్టర్ యజమానులు రైతులు వేసుకున్న రోడ్డు మరమ్మతుల కోసం, ధూళి నివారణకై వాటర్ ట్యాంకర్ సరఫరా కోసం మరియు పగిలిన పైపుల మరమ్మతుల కోసం ఇసుక రవాణా చేస్తున్న యజమానులు ప్రతి ట్రాక్టర్ కి 200 రూపాయలు అందిస్తామని ఒప్పందం చేసుకొని డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో తమ సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తు శనివారం ట్రాక్టర్లు రహదారిపై నిలిపి వెయ్యబడ్డాయి.
గ్రామస్తులు మాట్లాడుతూ, గ్రామంలో అంగీకారాలు మరియు సహకారం లేకుండా ఇసుక రవాణా చెయ్యవద్దని, ఇకనైనా ప్రజల సమస్యల గురించి ఆలోచించి తద్వారా గ్రామాభివృద్ధి కోసం సరైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.








