బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ – ఘనంగా వర్ధంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామంలో తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచి తెలంగాణ చరిత్రలో ఓ స్ఫూర్తిదాయకమైన అధ్యాయం సృష్టించిన వీరనారి చాకలి ఐలమ్మను గుర్తు చేసుకుంటూ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ బడుగు జీవుల అస్థిత్వాన్ని కాపాడుతూ సమానత్వం కోసం బందుకులు పట్టి పోరాడిన వీరనారి అని, ఆమె ఆశయాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కోసం 42% రిజర్వేషన్లు కల్పించే దిశగా చట్టాలు ఆమోదించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కులగణన చేపట్టడం ద్వారా బీసీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ హక్కులు, ఉద్యోగ అవకాశాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.

చాకలి ఐలమ్మ స్పూర్తిని భావితరాలకు అందించాలనే సంకల్పంతో చిట్కుల్ గ్రామంలో రాష్ట్రంలోనే అతి పెద్ద కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి చాకలి వెంకటేష్ సత్తయ్య బాబు కిషోర్ రజక సోదరులు మాజీ PACS చైర్మన్ నారాయణ రెడ్డి, ఆంజనేయులు అశోక్ లింగం లక్ష్మణ్ ప్రవీణ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment