|| దృశ్యం న్యూస్ ||
జాతీయ గీతం వందేమాతరం 150 ఏళ్ల పూర్తి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండులో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించబడింది. బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన ఈ గేయం భారత స్వాతంత్ర్య సమరంలో పోరాట స్ఫూర్తిని నింపిన గీతంగా గుర్తింపు పొందింది.

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, సుభాష్ చంద్ర బోస్, రంగా నాయక్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, జార్జ్, శైలేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “వందేమాతరం గేయం దేశభక్తి, ఐక్యత, త్యాగం వంటి విలువలను ప్రతిబింబిస్తుంది. ప్రతి పోలీసు అధికారి ప్రజల సేవలో అదే స్పూర్తితో పనిచేయాలి” అని పేర్కొన్నారు.
వందేమాతరం గీతంతో దేశభక్తి స్ఫూర్తిని పునరుద్ధరించిన ఈ వేడుకలో మెదక్ టౌన్, రూరల్, హవేలీ, ఘనపూర్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








