వాల్మీకి రామాయణం, అంబేద్కర్ రాజ్యాంగం: మాకు ఆదర్శాలు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ ||

భారతీయ జనతా పార్టీ ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షుడు శివకుమార్ అధ్యక్షతన అంబేద్కర్ భవన్‌లో వాల్మీకి జయంతి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం ఇచ్చారు.

ఈ సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ, వాల్మీకి రాసిన రామాయణం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారతీయ జనతా పార్టీ యొక్క ప్రేరణలుగా ఉన్నాయని, “మన దేశ సంస్కృతిని, సంప్రదాయాలను పాటిస్తూ, శ్రీరాముని జీవితం ఆదర్శంగా తీసుకుంటాం అని, వాల్మీకి రామాయణం లేకుండా శ్రీరాముడు ఎవరో మనకు తెలియదు అని, దాన్ని రాసిన మహానుభావుడు వాల్మీకి అని అభివర్ణించారు.

అదేవిధంగా విద్యార్థులకు విద్య మాత్రమే కాదు వినయం, విధేయత కూడా అత్యంత ముఖ్యం అని, చదువు, శ్రద్ధ, కష్టపడటం, ఈ మూడు విద్యార్థుల భవిష్యత్తును మారుస్తాయి అని, విద్యతో పాటు క్రీడలు, సంస్కృతి కళల రంగాల్లో కూడా ప్రతిభ కనబరచాలని అలా చేయడం ద్వారా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని చెప్పారు.

“మన భారతీయ సంస్కృతి అనేది ఒక ధర్మం, ఈ ధర్మాన్ని పాటించి భవిష్యత్తులో మన సంస్కృతిని పట్ల గౌరవంతో జీవించాలి ” అని ఆయన ఆచరణీయ సూత్రంగా విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు.
అలాగే వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, నాగోళ్ళ లక్ష్మీనారాయణ, దేవర్ సంజు, పవర్ సాయినాథ్, బోత్ శేఖర్ ముత్యాలు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment