|| దృశ్యం న్యూస్ ||
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు పూర్తి మద్దతు తెలపింది. నేడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్దిసూరి సమ్మెకు మద్దతుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సూరి మాట్లాడుతూ, గత 17 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి న్యాయమైన పోరాటం చేస్తున్నారాని ఈ పోరాటంలో విద్యార్థి సంఘం పూర్తిగా మద్దతుగా ఉంటుంది అని తెలిపారు.

తాము అధికారంలోకి రాగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల సమయంలో అంగీకరించిన ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ సమస్యలను పక్కన పెడుతున్నారని వ్యాఖ్యానించారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లలో 1080 రోజుల ప్రసతి సెలవులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 30 లక్షల రిటర్మెంట్ బెనిఫిట్స్ అనే డిమాండ్ల గురించి సర్కార్ వెంటనే చర్చలు జరిపి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఈ ఉద్యమం విజయవంతం కావడానికి యుఎస్ఎఫ్ఐ కృషి చేస్తుందని పెద్దిసూరి హామీ ఇచ్చారు.








