మాజీ ఎమ్యెల్యే నారా రామ్మూర్తి నాయుడుకి నివాళులు.

|| దృశ్యం న్యూస్ ||

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు అయిన మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ తొండ రాజేందర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు.

నారా రామ్మూర్తి నాయుడు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సేవా, నాయకత్వం చంద్రగిరి నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం కల్పించాలని కోరుకున్నారు.

నారా రామ్మూర్తి నాయుడి సేవలను గుర్తు చేసుకుంటూ, వారి స్మృతిని గౌరవిస్తూ, పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment