ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా వేగవంతం – లబ్ధిదారుల్లో సంతోషం.

|| దృశ్యం న్యూస్ ||

పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఇటీవల వరుస భారీ వర్షాల ప్రభావంతో మంజీర నది పరివాహక ప్రాంతాలు అయిన బోధన్–బాన్సువాడ మండలాల్లో ఇసుక రవాణా నిలిచిపోయిన విషయం తెలిసిందే. నది ప్రవాహం అధికంగా ఉండటంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి.

 

అయితే గత కొన్ని క్రితం వర్షపాతం తగ్గడంతో నది ప్రవాహం తగ్గి, స్థానికంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా మళ్లీ ప్రారంభమైంది. అదనంగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు నిజామాబాద్ జిల్లా పరిధిలోని దూర ప్రాంతాలకూ ఇసుక చేరేందుకు గురువారం సాలురా మండలం తగ్గేల్లి గ్రామం నుండి టిప్పర్ల ద్వారా రవాణాకు అనుమతులు మంజూరు చేశారు.

ఇసుక సరఫరా తిరిగి ప్రారంభం కావడంతో నిజామాబాద్ జిల్లా పరిధిలోని లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకునే అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం విడతల వారీగా అందజేస్తున్న బిల్లులను పొంది ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment