|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో డీజే వినియోగంపై అధికారాలు కఠినంగా నిషేధం విధించారు. శుక్రవారం రోజున ధర్పల్లి మండల కేంద్రంలో డీజే ఓనర్లతో సిఐ మరియు ఎస్ఐ సమావేశం నిర్వహించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, ప్రచారాలు, ర్యాలీ బృందాలు డీజేలను ఉపయోగించరాదని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేసి, పాలుపంచుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల కోసం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, డీజే సౌండ్ వ్యవస్థలను పూర్తిగా దూరం పెట్టాలని సూచించారు. ప్రజలు మరియు డీజే ఓనర్లు చట్టాన్ని గౌరవించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.








