|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి గురువారం మీడియాతో మాట్లాడారు, ఈ సందర్భంగా శివాలయం అభివృద్ధి కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం మధ్యాహ్నం ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో నిర్వహించబడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని వర్గాల ప్రజలు, అధికారులు, నాయకులు హాజరుకావాలని కోరారు.
ఈ సమావేశంలో డైరెక్టర్లు కమల భూమేష్, సింగం లక్ష్మణ్, సూరలింగం తదితరులు పాల్గొన్నారు.
శ్రీ చక్రేశ్వర శివాలయం అభివృద్ధికి కొత్త దిశను చేపడుతూ, అన్ని వర్గాల సమన్వయంతో పని చేయడం ప్రారంభిస్తామని హరికాంత్ చారి తెలిపారు.










