అంగన్వాడి కేంద్రాలలో సమయపాలన లోపాలు : టీచర్ల స్థానంలో ఇతరులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది, ఈ కేంద్రాల్లో ఆచరణీయ నిబంధనలకు విరుద్ధంగా టీచర్ల స్థానంలో ఇతరులు, సహాయకులు, ఆయాలు నియమించి పనులు సాగిస్తుండడంపై పిల్లల తల్లిదండ్రులను కలవరపెడుతోంది. సంబంధిత అధికారులు అంగన్వాడి కేంద్రాల పై పర్యవేక్షణ లోపం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వలన ఇలాంటి సమస్యలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.

శనివారం రోజున ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాద్ కాలనీలోని అంగన్వాడి కేంద్ర నిర్వహణ గురించి ఓ పత్రిక ప్రతినిధికి స్థానికులు సమాచారం అందించడంతో
అ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించగా ఉదయం 10 గంటల వరకు టీచర్ రాజేశ్వరి విధుల్లో హాజరు కాకపోవడం, ఆమె స్థానంలో వృద్ధుడు ఉన్నట్లు గమనించడం జరిగింది. ఇలాంటి పరిస్థితి గతంలోనూ పలుమార్లు ప్రత్యక్షమైంది అని స్థానికులు తెలిపారు.

వృద్ధులను చిన్నపిల్లల దగ్గర అనుమతించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆదేశాలను అనుసరించకుండా కేంద్రం నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ కేంద్రాలలో ఆహార జాబితా ప్రకారం వంటలు చేయడంలో కూడా కొరతలు కనిపించాయి.

ఈ విషయం మీద మండల సూపర్వైజర్ విజయరాణిని సంప్రదించగా టీచర్ రాజేశ్వరీకి సెలవు ఇవ్వలేదని, బినామీ వ్యక్తులు పనులు చేయకూడదని సూచించామని తెలిపారు. ఈ ఘటనపై త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అంగన్వాడి కేంద్రాలను సమయానికి పర్యవేక్షించడం ముఖ్యమని, అధికారులు కార్యాలయాల్లో కూర్చుంటే ఈ తరహా సంఘటనలు మరిన్ని చోటుచేసుకుంటాయని స్థానికులు మండిపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment