|| దృశ్యం న్యూస్ ||
బోధన్ సబ్ మెజిస్ట్రేట్‌కు వినతి పత్రం సమర్పించిన TSP.
తెలంగాణ స్టూడెంట్ పరిషత్ (TSP) నాయకులు బోధన్ డివిజన్ సబ్ మెజిస్ట్రేట్ ను కలసి వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా TSP నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మావురం శ్రీకాంత్ మాట్లాడుతూ,
వసతి గృహాల్లో స్నానపు గదులు మరియు మరుగుదొడ్లు లేనందున, విద్యార్థులు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
చలికాలం ప్రారంభం కావడంతో విద్యార్థులు నిద్రలేచి స్నానం చేయడానికి ఉదయం మూడు గంటల సమయంలో అవస్థలు పడుతున్నారు అని, ఈ పరిస్థితి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నదని, ఈ సమస్య వల్ల చాలామంది విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు అని, అందుకే వసతి గృహాల్లోని మౌలిక వసతుల అభివృద్ధి ఎంతగానో అవసరం అని తెలియజేస్తున్నట్లు శ్రీకాంత్ చెప్పారు.
అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఇన్చార్జ్ వార్డెన్ వ్యవస్థను మరింత క్రమబద్ధం చేయాలని కోరుతూ, ఒకే ఒక వార్డెన్ విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని, HWO (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్) ను తొందరగా నియమించి, వసతి గృహాల పనులను మెరుగుపరచాలని TSP నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ అధికారులను త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, TSP నాయకుల ఈ వినతి ద్వారా వసతి గృహాలలో విద్యార్థుల కోసం అవసరమైన మౌలిక వసతులు మరియు ఆరోగ్యపరమైన పరిష్కారాలకు అధికారుల నుండి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు.








