|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా కేద్రంలో గల కాకతీయ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఘటనకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఈ ఘటనపై విద్యార్థి నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తు, మృతికి కారణమైన కాకతీయ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఖండించాల్సిన అవసరం ఉందని వారు వ్యాఖ్యానించారు.
గత వారం రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యార్థిని కనీసం పట్టించుకోకుండా, విద్యార్థి మృతికి కారణమైన యాజమాన్యం దానికి సమాధానం చెప్పాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆ విద్యార్థి నేరుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో యాజమాన్యం ఏమాత్రం జాగ్రత్త తీసుకోలేదని వ్యాఖ్యానించారు.

విద్యార్థి నాయకులు, యాజమాన్యంతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ, ముందస్తు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం, వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది అని, దీనిపై విద్యార్థి నాయకులు స్పష్టత కోరగా, “సీఐ గారితో మాట్లాడండి” అనే సమాధానాలతో తమ తప్పుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడం యాజమాన్యపు నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ ఘటనపై విద్యార్థి నాయకులు ప్రభుత్వానికి, ప్రజలకు వివరాలు అందించాలని కోరుతున్నారు. కాకతీయ యాజమాన్యం తక్షణమే బాధ్యులైన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.








