|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో పాత వర్ని గ్రామానికి చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు, ఈ సమావేశంలో పాత వర్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం సభ్యులు, నాయకులు గ్రామంలో జరిగే రాజకీయ పరిణామాల గురించి చర్చించారు,
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ మొగులయ్య, జీవన్, చొక్కం వీరయ్య, సాదుల రవి, సొసైటీ డైరెక్టర్ గంగప్ప తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరియు రాజకీయ వ్యూహాలపై జరిగిన చర్చలు ఈ సమావేశానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయని ఈ సమావేశం ద్వారా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంచడం, రాజకీయ బాధ్యతలను దృష్టిలో ఉంచడం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.










