|| దృశ్యం న్యూస్ ||
హొలీ పండుగ సందర్భంగా ప్రజలు ఉదయం నుంచి రంగులతో సందడి చేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, ఆటపాటలతో ఉత్సాహంగా హోలీని జరుపుకున్నారు. అయితే సాయంత్రం ఫాల్గుణ మాస శుద్ధ పౌర్ణమి కారణంగా పూర్తిగా నిండైన చంద్రుడు నారింజ రంగులో కనిపించడం విశేషంగా నిలిచింది.
నిజామాబాద్ పట్టణ స్థానిక ప్రజలు ఆకాశంలో కనిపించిన నారింజ రంగు చంద్రుడిని ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. చంద్రుడు కూడా హోలీ పండుగలో భాగమై రంగులు వేసుకున్నట్లు అనిపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ అపూర్వ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ఈ సహజమైన ఖగోళ అద్భుతం వాతావరణ మార్పుల కారణంగా, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో చంద్రుడు నారింజ రంగులో కనిపించవచ్చని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా ఈ దృశ్యం ప్రజల్లో ఎంతో ఆసక్తిని కనబరుస్తుంది.








