|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

జాతర ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి, డీఎస్పీ ప్రసన్న కుమార్, తదితరులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ జాతర ఆధ్యాత్మికంగా మరియు శాస్త్రపరంగా నిబంధనలు పాటిస్తూ నిర్వహించాల్సిన అవసరం పై ఆలోచించారు. భక్తులకు త్వరగా దర్శనం లభించేలా చర్యలు తీసుకోవాలని, జాతరలో భద్రత కోసం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

జాతర సందర్భంగా బస్సు సేవలు, త్రాగునీటి సదుపాయాలు, పారిశుధ్య సిబ్బంది, వైద్య శిబిరాలు, అగ్నిమాపక యంత్రాలు, మరియు సహాయ కేంద్రం వంటి సేవలను భక్తులకు అందించేందుకు అన్ని రంగాల అధికారులు సమన్వయం చేస్తున్నారు.
ఈ జాతర భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని రంగాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.








