పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి – మంత్రి దామోదర్ రాజనర్సింహ.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖామాత్యులు దామోదర్ రాజనర్సింహ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పల్లెల ప్రగతికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తూ, మోడల్ పాఠశాలలు, రోడ్లు, మౌలిక వసతులపై దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు.

టేక్మాల్ మండలంలో 28 కోట్ల 45 లక్షల రూపాయలతో బీటీ రోడ్లు, మోడల్ స్కూల్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్లు-భవనాల శాఖ ఆధ్వర్యంలో 20 కోట్ల రూపాయలతో బీటీ రహదారులు, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 8.45 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.

మోడల్ స్కూల్‌ను పరిశీలించిన మంత్రి, కంప్యూటర్ ల్యాబ్ సహా అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎల్లుపల్లి తాండా, వెంకటాపూర్ తండా, నార్సింగి-శంకరంపేట రహదారుల అభివృద్ధికి కూడా పలు కోట్ల రూపాయల నిధులు కేటాయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్‌డీఓ రమాదేవి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment