ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల నుండి ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించి, కేంద్రం నిర్వాహకుల వివరణలు అడిగి తెలుసుకున్నారు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ లోని వివరాలు
కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో సేకరించిన ధాన్యపంటలు మరియు ప్రక్రియ పై ఆరా తీశారు, సన్నరకం, దొడ్డు రకం ధాన్యాలను ఎంత పరిమాణంలో సేకరించారో, ట్రక్ షీట్స్, బిల్ టాగ్స్, కొత్త గన్నీ బ్యాగుల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేయడం కోసం ఓపీఎంఎస్ ( ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ) మరియు లోకల్ యాప్‌లో కూడా అన్ని వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 629 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో సన్న రకం మరియు దొడ్డు రకం ధాన్యాలకు ప్రత్యేకంగా కేంద్రాలను అందుబాటులో ఉంచినట్టు, ఈ సారి ప్రభుత్వం సన్న రకానికి క్వింటాలుకు రూ.500 బోనస్ అందజేయాలని ప్రకటించింది, రైతులు తమ ధాన్యాన్ని ధాన్యం సేకరణ కేంద్రాలలో సరైన సమయంలో అందించగలిగితే ఈ బోనస్‌ను పొందవచ్చు అని,
కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని, అతి త్వరగా నిర్దేశిత రైస్ మిల్లులకు పంపే ప్రక్రియను వేగవంతం చేసినట్టు కలెక్టర్ తెలిపారు, అన్ని కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచడం జరిగింది అని,

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ధర్పల్లి తాహసిల్దార్ మాలతి, ఎంపీడీవో బాలకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే తమకు అద్భుతమైన సహాయంగా నిలిచాయని, మరింత సౌకర్యాలు మరియు సులభతర మార్గాలు ఉండాలని కోరుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment