పాత వర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పాత వర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బీర్కూర్ మొగులయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వర్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి మండలాల మార్కెట్ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ— పార్టీ బలపరచడంలో అందరూ కలిసికట్టుగా పని చేయాలని, రాబోయే గ్రామ పంచాయతీ, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్నారు.

ఈ సమావేశంలో బాన్సువాడ ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని గ్రామాభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment