మెదక్: జాతీయ మెగా లోక్-అదాలత్‌లో 2446 కేసుల రాజీ: 106 సైబర్ క్రైమ్ బాధితులకు న్యాయం.

|| దృశ్యం న్యూస్ ||

జాతీయ మెగా లోక్-అదాలత్‌లో భాగంగా మెదక్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 2446 కేసుల పరిశీలన జరిగింది. ఈ కేసుల్లో ఐ.పి.సి & BNS (482), సైబర్ క్రైమ్ (106), ఈ-పెట్టి (193), డి.డి & MV యాక్ట్ (1665) కేసులు చేర్చబడ్డాయి. మొత్తం 2446 కేసులలో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకొని సమస్యలను తక్షణమే పరిష్కరించుకున్నారు.

ముఖ్యంగా, 106 సైబర్ క్రైమ్ కేసుల్లో రూ. 24,19,680/- మొత్తం బాధితుల ఖాతాల్లో తిరిగి జమ చేయబడింది. ఈ నిర్ణయం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు పెద్ద ఉపశమనంగా నిలిచింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ మాట్లాడుతూ, “లోక్-అదాలత్ అనేది క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అద్భుత వేదిక. ఇరు వర్గాలు రాజీ మార్గం ద్వారా వివాదాలను పరిష్కరించడం సమాజానికి మేలు చేస్తుంది” అని అన్నారు.

ఆయన లోక్-అదాలత్ వేదికలను సమాజంలో శాంతి నెలకొల్పడంలో కీలకమైనదిగా పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment