నిజామాబాద్ : నగరంలోని పలు దుకాణాలు, షోరూంలను సీజ్ చేసిన నగరపాలక సంస్థ అధికారులు..

|| దృశ్యం న్యూస్ ||

శుక్రవారం ఉదయం, నగర పాలక కమిషనర్ నగరంలో ఆకస్మికంగా సందర్శించి, గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను బాకాయిలు చెల్లించని వారిపై కఠిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు దుకాణాలు, షోరూంలు సీజ్ చేయబడినట్లు అధికారులు వెల్లడించారు.

అదేవిధంగా, ఎల్.జి షోరూమ్, విశాల్ మార్ట్, ఐ.డి.ఎఫ్.సి బ్యాంకు వంటి సంస్థలకు బకాయిలు త్వరలో చెల్లించలని ఆజ్ఞలు జారీ చేసామని, వారు త్వరలో బకాయిలు చెల్లించని యెడల వారిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు నగర పాలక కమిషనర్ తెలిపారు. బకాయిలు పెద్ద మొత్తంలో ఉండటంతో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

నగర ప్రజలు తమ పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని నగర పాలక కమిషనర్ పిలుపు ఇచ్చారు. ‘‘భవిష్యత్తులో కూడా, బకాయిలు చెల్లించని వారిపై ఇదే తరహా చర్యలు కొనసాగించనున్నాం’’ అని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment