|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఈ పర్యటనను సమన్వయపరచిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, బృంద సభ్యులకు రోడ్లు, పంటలు, ఆస్తి మరియు ప్రాణ నష్టాలపై సవివరమైన వివరాలు అందించారు.

కేంద్ర బృంద సభ్యులు డాక్టర్ కే.పొన్ను స్వామి, వినోద్ కుమార్, అభిషేక్ కుమార్, ఏస్ ఎస్ పింటు లకు కలెక్టర్ కార్యాలయంలో స్వాగతం పలికారు. అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు, తెగిపోయిన రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, పంట నష్టం వంటి అంశాలను వివరించారు.
తదనంతరం మాక్తభూపతిపూర్, తిమ్మానగర్, నందిగామ, రామాయంపేట, బ్యాతోల్, వనదుర్గ, ఏడుపాయల వంటి ప్రాంతాల్లో బృందం ప్రత్యక్షంగా పర్యటించింది, వారితో పాటు జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఆర్డీవోలు పాల్గొన్నారు.
పర్యటన ముగింపు సందర్భంగా ఏడుపాయల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బృందం, మొత్తం నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి మెదక్ జిల్లాకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.








