|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా గౌతమ్ నగర్ నాలుగవ NGO, S కాలనీ జన్మభూమి రోడ్డులో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, స్థానికుల సహకారంతో వేద పండితుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం మరియు ఇతర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

ఈ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు..

ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ, “ఇందూరు నగరంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం 3 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం శుభకార సందర్భం అని, అమ్మవారు నగర ప్రజలకు అత్యంత దివ్యమైన ఆశీస్సులు అందిస్తోంది అని, అమ్మవారి ఆశీస్సులతో నగర అభివృద్ధి జరుగుతుందని” అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు.










