అభయహస్తం ఫౌండేషన్ ప్రతినిధి బర్ల మధుకర్ కు ఘన సన్మానం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఉమ్మడి కోటగిరి మండలంలో 2024-2025 సంవత్సరంలో అభయహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 16 గ్రామాల్లో 18 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, దాదాపు 2600 మంది పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించిన అభయహస్తం ఫౌండేషన్ ప్రతినిధి బర్ల మధుకర్ ను భవాని లయన్స్ క్లబ్ ఘనంగా సన్మానించింది. ఈ శిబిరాలను సంజీవని హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ ఇంతియాజ్ బేగం సహకారంతో నిర్వహించారు.

ఈ సేవలకు గుర్తింపుగా లయన్స్ క్లబ్ తరఫున జ్ఞాపికను అందచేసి, బర్ల మధుకర్ ను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం ఎంతో ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి ఫౌండర్, మాజి జిల్లా గవర్నర్ బసవేశ్వర రావు, లయన్ పి.లక్ష్మీ, రీజియన్ చైర్మన్ లయన్ పి. శ్రీధర్, మాజీ రీజియన్ చైర్మన్ లయన్ శ్రీనివాస్ గౌడ్, క్లబ్ అధ్యక్షులు రవీందర్ బాబు, సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment