|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహంలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలపై తెలంగాణ జాగృతి నాయకులు అధికారులకు వినతిపత్రం అందించారు. తహసీల్దార్ శాంత, ఎంపీడీవో బాలకృష్ణ లను కలిసి, విద్యార్థినిలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు.

వసతి గృహంలో డైనింగ్ హాల్ లేకపోవడం, రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం, సోలార్ లేదా ఇన్వర్టర్ వంటి ప్రత్యామ్నాయ విద్యుత్ వ్యవస్థల లభ్యత లేకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు విద్యార్థినులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
విద్యార్థుల భద్రత, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని వీటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జాగృతి మండల అధ్యక్షుడు రాము, రాహుల్, రవికాంత్, ప్రేమ్ కుమార్, భాను ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు.








