|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్యపై మీడియా సమావేశం ఏర్పాటు చేయడమైంది,
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కల్యాణ్ మాట్లాడుతూ స్వాతి ప్రియ చావు గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తారు.
స్వాతి ప్రియ ఆత్మహత్యకు సంబంధించిన సూసైడ్ నోట్ లో ఆరు పేజీల సుదీర్ఘ వివరణ ఇవ్వబడినప్పటికీ నోట్ లో ఆమె చనిపోవడానికి నిజమైన కారణలు పోలీసులు స్పష్టంగా వివరించలేదని, ఫోన్ కాల్ హిస్టరీని చెక్ చేయవద్దని స్వాతి ప్రియ సూచించిన తీరు ఆమె మరణానికి ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టేందుకు ఉపయోగపడుతుందని,
స్వాతి ప్రియ ఒక టాప్ స్టూడెంట్ గా ఉండి ఆమె మానసికంగా దృఢంగా ఉండలేక పోవడం ట్రిపుల్ ఐటీలో చదువుకునే విద్యార్థులు మాత్రమే ఇలాంటి నిర్ణయాలకు ఎందుకు తీసుకుంటున్నారు అని ప్రశ్నించారు.
తల్లిదండులుతో స్వాతి ప్రియ ఉదయం 7:30 గంటలకు సంతోషంగా మాట్లాడిన తర్వాత 8:30కి హాస్పిటల్ కు తీసుకెళ్లిన సమాచారం వచ్చినందుకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇలాంటి అంశాలపై అనేక సందేహాలు రేకెత్తిస్తున్నాయని గత 10 సంవత్సరాల్లో బాసర ట్రిపుల్ ఐటీ లో 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణం అని ఈ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు తగిన న్యాయం అందించవలసిన అవసరం ఉందని తెలిపారు.
అదేవిధంగా విద్యార్థి నాయకులకు యూనివర్సిటీలలో ప్రవేశం ఉన్న ఎందుకు అనుమతించరు అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని,
విద్యార్థి నాయకులే విద్యార్థుల సమస్యలను బయటపెట్టే వక్తలుగా ఉంటారని అందువల్ల వారికి అనుమతి ఇవ్వడం చాలా అవసరమని తెలిపారు.
స్వాతి ప్రియకు న్యాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తూ, విద్యార్థుల మానసిక ఆరోగ్య రక్షణ కోసం సత్వర చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.
ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు అఖిల్, సాయి, అఖిలేష్, మనోహర్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.








