కొడాలి కిషోర్ ని సన్మానించిన తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ప్రయివేట్ పాఠశాలల అధ్యక్షులు కొడాలి కిషోర్ ని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (TSP) జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ సన్మానించారు.

ఈ సందర్భంగా TSP జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ, కొడాలి కిషోర్ స్థానిక బోధన్ పట్టణం నుండి ఇందూర్ పాఠశాలల కారాస్పాండెంట్ గా ఎన్నిక కావడం పై హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు సేవ, సమాజం పట్ల చూపిస్తున్న సానుకూల వైఖరి మరియు అనేక సేవా కార్యక్రమాలు గురించి ప్రశంసించారు, మరియు విద్యా రంగంలో ఎన్నో సేవలు అందిస్తూ, పలు సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ, వేలాది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో TSP జిల్లా నాయకులు అనిల్, శివ తదితరులు పాల్గొన్నారు.
కొడాలి కిషోర్ మరింత మంచి పదవులు అందుకోవాలని ఆశిస్తున్నామంటూ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment