మెదక్ జిల్లాలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం నిర్వహణకు సిద్ధం.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సెప్టెంబర్ 17న జిల్లాలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజా పాలన దినోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్య అతిథి చేత జాతీయ పతాక ఆవిష్కరణ జరుగుతుందని, ప్రతి శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment