|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్ చైతన్యపురి కాలనీలో జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ విమోచన ఉద్యమ యోధులకు నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి బాలరాజు, ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు ఓంకార్, మహిళా మోర్చా నాయకురాలు రాణి, బిజెపి నాయకులు రాజు, సంతోష్, యాదగిరి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి నేతలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, విమోచన దినోత్సవం ప్రతి ఒక్కరికి గర్వకారణమని పేర్కొన్నారు.








