|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా చిట్కుల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

నీలం మధు మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయుడిగా సేవలందించి, విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించిన రాధాకృష్ణన్ గారి త్యాగం అమూల్యమని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, సావిత్రిబాయి పూలే, జ్యోతిబా ఫూలే వంటి మహనీయుల స్ఫూర్తితో విద్యారంగంలో సేవ చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాలల భవిష్యత్తు కోసం కృషి కొనసాగించాలని సూచించారు.








