తల్లిదండ్రుల తర్వాత గౌరవప్రదమైన వారు ఉపాధ్యాయులు – ఎమ్యెల్యే సుదర్శన్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా బోధన్‌ పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని సారయు కన్వెన్షన్ హాల్ లో బోధన్ ప్రైవేట్ పాఠశాల, జూనియర్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్యెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, “తల్లిదండ్రుల అనంతరం పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే గౌరవప్రదమైన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుంది అని, ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది అని, నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలను పిల్లలకు బోధించడం అత్యంత అవసరం” అని అన్నారు.

 

దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణం విద్యా రంగంలో ప్రధాన కేంద్రంగా నిలుస్తోందని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్రం, దేశం అభివృద్ధికి తోడ్పడేలా తీర్చిదిద్దాలని సూచించారు.

ఉపాధ్యాయుల విలువలను కాపాడడం సమాజ బాధ్యత.

ఉపాధ్యాయుల విలువలను కాపాడడం సమాజ బాధ్యత అని సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. నేటి తరం విద్యార్థులు నాణ్యమైన విద్యతో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రాస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్, గౌరవ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అందన్, టిపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి, లయన్స్ క్లబ్ లక్ష్మీ బసవేశ్వరరావు, బోధన్ ఎసిపి శ్రీనివాస్, తదితర ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment