విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి : తహసిల్దార్ సూచనలు

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన బాధ్యత గురించి తహసిల్దార్ మాలతి వంట చేసే సిబ్బందికి వివరించారు.

శనివారం ఆమె దర్పల్లిలోని మోడల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యమైన బియ్యం, కూరగాయలు, పప్పులను పరిశీలించి, రెండు సార్లు తనిఖీ చేయాలని భోజనం తయారు చేసే నిర్వాహకులకు సూచించారు. వంట చేసిన తరువాత విద్యార్థులకు భోజనం వడ్డించాల్సిన విధానంపై దృష్టి పెట్టాలని ఆమె చెప్పారు.

ప్రభుత్వం అందించిన మెనూ ప్రకారం భోజనంలో నాణ్యతను చేపట్టాలని, విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమైనదని ఆమె స్పష్టం చేశారు. ఆహారంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment