|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ధర్మారం గ్రామానికి చెందిన సుండు నర్సయ్య సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ను అధికారుల సమక్షంలో జైతపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో దాఖలు చేశారు. ఈసారి ధర్మారం గ్రామానికి జనరల్ రిసర్వేషన్ కేటాయించటం జరిగింది.

నామినేషన్ సమర్పించిన అనంతరం సుండు నర్సయ్య మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం మరియు మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి ధర్మారం అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.








