వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం వినతి పత్రం సమర్పణ : కందగట్ల రాంచందర్.

|| దృశ్యం న్యూస్ ||

శుక్రవారం రోజు ఎడపల్లి మండల రెవిన్యూ అధికారికి కందగట్ల రాంచందర్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించబడింది. ఒక ఎకరం కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు వరి కోసి 10 నుంచి 15 రోజులు అయ్యినా, తమ ధాన్యం వ్యాపారస్తులు కొనుగోలు చేయకపోవడం వల్ల తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారాని, రైతు ఋణమాఫీ, రైతు భరోసా పథకాలు, అలాగే 500 రూపాయల బోనస్ వంటి పథకాలు అమలులో లేక, రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారాని అందువల్ల, మండలంలో వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, చిన్న, సన్న కారు రైతులకు సహాయం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు కటకం సుధాకర్, కటకం అరుణ్, దేవర్ల నవీన్, నాయకులు ప్యాట గంగాధర్, కంజరి ప్రదీప్, రఘు, సాయి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment