విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి: ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం.

|| దృశ్యం న్యూస్ ||

భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్, విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి విషయమై ఓ ప్రకటన ద్వారా మీడియా కు తెలియచేస్తూ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు న్యాయమైన విద్య అందించడమే బిఏఎస్ పథకం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. విద్యార్థులపై పెరిగిన ఫీజుల ఒత్తిడి, ప్రభుత్వ బకాయిలు కారణంగా వారు సజావుగా చదువుకోలేకపోతున్నారని, తమ తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వమే స్పందించకపోతే, ఆందోళనలు పెరిగే అవకాశముందని హెచ్చరించారు.

ఈ సమయంలో స్కాలర్షిప్, ఫీజు రిమెంబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం దాదాపు 8800 కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని తెలుపుతూ విద్యార్థులకు సరైన మౌలిక వసతులు, ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, గురుకులాలు, కస్తూర్బా గాంధీ విద్యార్థులకు సరైన పోషక ఆహారం అందించకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ చిన్న పని చేస్తున్నాం టీ సీఆర్పీలను రిజర్వేషన్ చేసి వారికి న్యాయం చేకూర్చాలని, ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment