విద్యార్థులు పరీక్షల ఫలితాలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, శనివారం రోజు హవేలీ ఘన్పూర్ మండలంలోని మహాత్మా గాంధీ జ్యోతి బాపూలే బాలుర పాఠశాలను సందర్శించి ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు సరైన భోజనం అందించడానికి కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. “ప్రతిరోజూ మెనూ ప్రకారం వంట చేయడం, పోషకాలతో కూడిన శుచిరుచికరమైన ఆహారాన్ని అందించడం తప్పనిసరి” అని స్పష్టం చేశారు.

కలెక్టర్ తనిఖీ సమయంలో, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, సరుకుల నిల్వ రిజిస్టర్లు, అకౌంట్ రిజిస్టర్లను పరిశీలించారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సమయపాలన ఖచ్చితంగా పాటించాలి అని సూచించారు.
అదేవిధంగా వంటగదిలో పరిశుభ్రతా చర్యలు పాటించడం, నాణ్యతా ప్రమాణాలను అనుసరించడం, ప్రతి రోజూ ఖచ్చితమైన వంట విధానాన్ని పాటించాలని కలెక్టర్ ఆదేశిస్తూ, విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment