పరీక్ష ఫలితాలతో సంబంధం లేకుండా విద్యార్థులను ప్రోత్సహించాలి : కృపాల్ సింగ్

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా బర్కత్ పుర ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఓ ముఖ్యమైన కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ, సోమవారం నుండి ప్రారంభమయ్యే సమ్మేటివ్ వన్ పరీక్షలకు సిద్ధమవ్వాలనుకుంటే, పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం అందించి, పౌష్టికాహారాన్ని ఇవ్వాలని వారు తల్లిదండ్రులకు సూచించారు.

ఈ సందర్భంగా, విద్యార్థులు రోల్ ప్లే మరియు చిత్రలేఖనం వంటి ప్రదర్శనలు, ఆహార ప్రాధాన్యత గురించి వివరణ ఇవ్వడం జరిగిందని, విద్యార్థుల సాధించిన ఫలితాలను సంబంధం లేకుండా, వారిని ప్రోత్సహించి కష్టపడి చదవడానికి ప్రేరేపించాలని కృపాల్ సింగ్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు,
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment