|| దృశ్యం న్యూస్ ||
గ్రామాభివృద్ధి కమిటీ (VDC) ల పేరుతో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. మొదట గ్రామాభివృద్ధి కోసం ప్రారంభమైన ఈ కమిటీలు ఇప్పుడు వివాదాల పరిష్కారం పేరుతో చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. సివిల్ తగాదాలు, భూ వివాదాలు, కుటుంబ గొడవలపై, పంచాయతీలు నిర్వహిస్తూ తీర్పులు చెబుతూ ప్రజలను పోలీస్ స్టేషన్ లేదా న్యాయస్థానాలకు వెళ్లనీయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు అని,
అలాగే గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో బెల్టు షాపులు, కిరాణ షాపులు, కోడిగుడ్ల ధరలు వేలం వేయడం ద్వారా అధిక ధర చెల్లించే వారికి మాత్రమే వ్యాపారం చేసే అనుమతిని ఇస్తూ అక్రమ వసూళ్లు చేస్తున్నారు అని, పంచాయితీల పేరిట ఇరుపక్షాల నుంచి డబ్బులు తీసుకుని తీర్పులు చెప్పడం, ఆ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం వంటి చర్యలు చట్టవ్యతిరేకమని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.
ప్రజలు ఇటువంటి అక్రమాలకు భయపడకుండా తమకు న్యాయం కోసం పోలీసులను సంప్రదించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పై బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరించింది.








