|| దృశ్యం న్యూస్ ||
మెదక్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించబడుతున్నాయి అని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు, అక్టోబర్ 21 నుండి 31 వరకు జరగనున్న పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా ఈ పోటీలు జరుగనున్నాయి. పోలీసుల త్యాగాలు, విధుల్లో ప్రతిభ, సేవా భావం ప్రతిబింబించే మూడు (3) తాజా ఫోటోలు లేదా మూడు నిమిషాల లోపు నిడివి గల షార్ట్ ఫిల్మ్‌లు 23-10-2025 లోపు జిల్లా పోలీస్ కార్యాలయంలోని PRO సెక్షన్‌కి అందజేయాలని ఎస్పీ సూచించారు.
2024 అక్టోబర్ నుండి 2025 అక్టోబర్ వరకు తీసిన ఫోటోలు, షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే అర్హమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన, ప్రజా సేవా కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సహాయం వంటి అంశాలపై ఆధారపడిన కృతులు ప్రాధాన్యం పొందనున్నాయని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.








