|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు మరియు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి మహా శివరాత్రి సందర్భంగా బీర్కూర్ మండల పరిధిలోని నారాయణపూర్ క్యాంప్ లోని శివాలయాన్ని, నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని సోమలింగాల దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సోమలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస రెడ్డి భక్తులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.








