జలాల్ పూర్ శ్రీ కృష్ణ మల్లన్నను దర్శించుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కృష్ణ మల్లన్న దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ధార్మిక పరిరక్షణ మరియు భక్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామస్థులు, భక్తుల సహాయంతోనే ఈ ఆలయ నిర్మాణం విజయవంతమైందని ప్రశంసించారు.

ఈ ప్రతిష్టాపన ఉత్సవంలో వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రద్ధా భక్తులతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులకు అన్నదానం నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment