పురాణే (పౌడయ్య) మఠం నుండి శ్రీక్షేత్ర కపిలధార్ మన్మథ్ స్వామి 15వ మహా పాదయాత్ర ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ ||

శ్రీక్షేత్ర కపిలధార్ పుణ్యక్షేత్ర మన్మథ్ స్వామి దివ్య జిత్త స్మారక దర్శనం కొరకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో, సుంకిని సిద్దేశ్వర మహారాజ్, మల్లికార్జున్ అప్ప, సంతోష్ మహారాజ్ సౌజన్యంతో జంగం గల్లీలోని పురాణే (పౌడయ్య) మఠం నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ నేతృత్వంలో 15వ మహాపాదయాత్ర శనివారం ప్రారంభమైంది. ఈ పాదయాత్ర కార్తీక మాసంలో ప్రారంభమై పౌర్ణమి నాటికి మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో గల మాంజర్ సొంబా లో గల వీరశైవ గురువు మన్మథ్ స్వామి దివ్య స్మారకాన్ని దర్శించే వరకు 15 రోజుల పాటు భక్తుల భజనలతో, కీర్తనలతో, కోలాటాలతో ముందుకు సాగుతుంది.

అందులో భాగంగా నేడు యాత్ర బోధన్ లో ప్రారంభమై నాగన్ పల్లి, సాలూర, ఖాజాపూర్, హుంసా, కొల్లూరు మీదుగా సుంకిని కి చేరుకుంటుంది. ఈ సందర్భంగా యాత్ర నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ మాట్లాడారు. ఇట్టి కార్యక్రమంలో వీరశైవ జంగమ లింగాయత్ ప్రముఖులు విఆర్ దేశాయ్, శ్యామ్ రావు, శివకుమార్ అప్ప, నర్సింగ్ అప్ప, శంకర్ అప్ప, పౌడయ్య రాజేందర్, గంగాధరప్ప, విట్టల్ అప్ప, లక్ష్మణ్ పటేల్, యాదవ్ రావు పటేల్, నాగభూషణం పటేల్, పురాణే దిలీప్ కుమార్, మహిళా భక్తులు కమలా బాయ్, ప్రభావతి, చంద్రకళ, గోదావరి, గంగాసాగర్, జయశ్రీ, లావణ్య, తదితర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment