దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ : ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి.

|| దృశ్యం న్యూస్ ||

ఇస్నాపూర్‌లో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి భక్తులకు ఆశీర్వాదం అందించారు.

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ దేవాలయాల నిర్మాణం ద్వారా గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ పెరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మధు పర్యవేక్షణలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముదిరాజ్ సంఘంఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది.

నీలం మధు మాట్లాడుతూ, “నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ దైవ చింతన చేయాలని తెలిపారు. “దైవ చింతన ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది” అని పేర్కొన్నారు. ఆలయాల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, ఆలయ నిర్వాహకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment