ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసిన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ నిన్న జరిగిన పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎన్నికల్లో కృషి చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 74% ఓటింగ్ శాతం మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 94% ఓటింగ్ శాతం నమోదవడం, ఈ ఎన్నికల్లోఓటర్లు ఎంతో ఉత్సహంగా పాల్గొన్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

దేశంలో నరేంద్ర మోడీ సంక్షేమ అభివృద్ధి మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు పోరాటం కీలకపాత్ర పోషించాయి. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి కు మద్దతుగా ఓటు వేసిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, భారతీయ జనతా పార్టీతోనే అన్ని సమస్యలు పరిష్కరించవచ్చని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment