విజయదశమి సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు – ప్రజలందరికీ ఐక్యతా సందేశం.

|| దృశ్యం న్యూస్ ||

విజయదశమి పర్వదినం సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, విజయదశమిని దుష్టశక్తులపై సత్యం, ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తూ ప్రజలందరూ ఐక్యత, సమగ్రతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

జిల్లా ప్రజల జీవితాల్లో విజయదశమి కొత్త తేజస్సు, ఆనందం మరియు శ్రేయస్సును నింపాలని ఆకాంక్షిస్తూ పండుగలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందించేవి కాబట్టి ప్రజలందరూ ఆనందంగా, శాంతియుత వాతావరణంలో ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు.

అదేవిధంగా నవరాత్రుల అనంతరం జరగబోయే దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను క్రమబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ పోలీసు విభాగానికి సహకరించి పండుగలను సంపూర్ణ ఉత్సాహంతో జరుపుకోవాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment