పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ – పారదర్శకమైన ఎన్నికలే లక్ష్యం ఎస్పీ పరితోష్ పంకజ్.

|| దృశ్యం న్యూస్ ||

సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.

ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను కాపాడటంతో పాటు, చట్టవిరుద్ధ చర్యలను వెంటనే అణచివేసేలా పోలీసు బృందాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాలలో ఎన్నికలను ప్రభావితం చేసేలా వ్యక్తులపై లేదా రాజకీయ పార్టీలపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

సోషల్ మీడియా మానిటరింగ్ టీములు 24 గంటలు పర్యవేక్షణ కొనసాగిస్తూ ఎన్నికల ప్రయోజనాల కోసం జరుగుతున్న అవకతవకలను వెంటనే గుర్తించాలని, ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, అనుమానాస్పద కదలికలు, అక్రమ డబ్బు రవాణా, మద్యం పంపిణీ వంటి ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికలు జరపడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పీ పంకజ్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment