|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో రేపు జరగనున్న ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, డీఎస్పీ ప్రసన్నకుమార్ తదితరులతో కలిసి పరిశీలించారు. పోలీస్, రెవిన్యూ విభాగాల సమన్వయంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ అన్నారు. ప్రధాన అతిథి ప్రసంగం, గౌరవ వందనం, పతాకావిష్కరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమంపై అవగాహన కల్పించడానికి అధికారులు పలు కార్యక్రమాలు సిద్ధం చేశారు.








