|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చెందిన K. శివకుమార్ S/o సత్యనారాయణ, తన అంకితభావంతో విద్యారంగంలో ఎంతో పురోగతి సాధించి, డోంగ్లి మండలానికి అగ్రికల్చర్ ఆఫీసర్ (AO)గా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా జానకంపేట్ సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ ఆధ్వర్యంలో శివకుమార్ ని ఘనంగా సన్మానించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్లు, మాజీ చైర్మన్లు, గ్రామ పెద్దలు, పాల్గొని శివకుమార్ కు అభినందనలు తెలిపారు.
శివ కుమార్ ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో గ్రామంలోని యువతలో కొత్త ప్రేరణను మొదలై అధిక విజ్ఞానం మరియు సమాజానికి సేవ చేసే అంశాన్ని ప్రేరేపిస్తుందని ఆశిస్తు, శివకుమార్ భవిష్యత్తులో ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.










